రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ లో వస్తున్న తాజా చిత్రం ది వారియర్. ఈ చిత్రంలో Ram పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన రాం ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది .తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సారి తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ఒక స్పెషల్ అప్డేట్ రానుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు చిత్రయూనిట్. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ చేశారు. లవర్స్ డే సందర్భంగా ఒక లవ్లీ సర్ప్రైస్ ఉంటుందని ప్రకటించారు. ఇక ఈ మూవీకి రాక్ స్టార్ DSP సంగీతాన్ని అందిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత Ram నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాలభామ Krithi Shetty కూడా ఈ మూవీకి ఒక పెద్ద ప్లస్ అని చెప్పాలి .మరి లవర్స్ డే రోజున ది వారియర్ మూవీ నుండి ఎలాంటి సర్ప్రైజ్ వస్తుంది అనేది చూడాలి మరి.