దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే తొలి మూడు రోజుల్లోనే కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ సినిమా ఐదో రోజు మంగళవారం కూడా బాక్సఫీసు వద్ద దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఐదో రోజు క‌లెక్ష‌న్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

★(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ ఐదు రోజుల వసూళ్లు..

తొలి రోజు – 74.11 కోట్లు
రెండో రోజు – 31.63 కోట్లు
మూడో రోజు – 33.53 కోట్లు
నాలుగో రోజు – 17.73 కోట్లు
ఐదో రోజు – 13.63 కోట్లు (20.45 కోట్లు) గ్రాస్‌ వసూళ్లు

మొత్తంగా చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమా (తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో కలిపి తొలి ఐదు రోజుల్లో 170.63 కోట్ల నెట్, 253.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఈ సినిమా హిందీలో 53.30 కోట్లు, కర్నాటకలో 24.85 కోట్లు, తమిళనాడులో 21.18 కోట్లు, కేరళలో 5.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 4.65 కోట్లు, ఓవర్సీస్‌లో 67.60 కోట్లు వాసులు చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ తొలి 5 రోజుల్లో 348.18 కోట్ల షేర్‌, 625 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది