మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరోగా కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య'(Acharya). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై ట్రైలర్, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 166 నిమిషాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే ఫస్ట్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు కలిపి సుమారు రెండు గంటల 46 నిమిషాలు అని చెప్పాలి. ఇదొక డీసెంట్ రన్ టైమ్ అని చెప్పొచ్చు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చందమామ కాజల్ హీరోయిన్‌గా నటించగా.. రామ్ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే సోనూసూద్ ముఖ్య పాత్ర పోషించాడు.
Recent Comment