రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.  రాజస్థాన్ రాయల్స్ జట్టు లో Shimron Hetmyer ఒక్కడే అర్ధ శతకం తో రాణించాడు.  Shimron Hetmyer  36 బంతుల్లో 59 పరుగులు చేశాడు.  అశ్విన్ 28 పరుగులతో రాణించాడు. ఓపెనర్లు బట్లర్ 13 పరుగులు, పడిక్కల్ 29 పరుగులు చేశారు

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల లో హోల్డర్, గౌతమ్ చెరో రెండు వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు

అనంతరం 166 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్,14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాలలో పడింది. రాహుల్, గౌతమ్ లు బౌల్ట్ బౌలింగ్ లో డక్ అవుట్ అయ్యారు.  హోల్డర్ ను 8 పరుగుల వద్ద ప్రసిద్ కృష్ణ అవుట్ చేశాడు.  క్విన్ టన్ డికాక్, దీపక్ హుడా క్రీజ్ లో ఉన్నారు