ముంబై వాంఖేడే స్టేడియం వేదిక గా ప్రారంభమైన ఐపీల్ మొదటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్ ను ధోని, జడేజా ఆదుకున్నారు. ధోని పోరాడటం తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ మాత్రం స్కోర్ సాధించింది.
ధోని 38 బంతుల్లో 50 పరుగులు (4×7 and 6×1) చేసి అజేయం గా నిలిచాడు. జడేజా 26 పరుగులతో అజేయం గా నిలిచాడు
కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, రస్సెల్ తలా వికెట్ తీశారు. అంబటి రాయుడు రన్ ఔట్ అయ్యాడు.
అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు. ఓపెనర్ రహానె 44 పరుగులు చేశాడు. బిల్లింగ్స్ 25 పరుగులు, నితీష్ రానా 21 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 16 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 20 పరుగులతో అజేయం గా నిలిచాడు. చెన్నై బౌలర్ల లో బ్రేవో 3 వికెట్లు తీశాడు
Recent Comment