మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం “రామారావు ఆన్‌డ్యూటీ” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రంతో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాజర్, నరేష్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా రామారావు ఆన్‌డ్యూటీ రిలీజ్‌డేట్‌ను ప్రకటించారు చిత్రబృందం. ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రవితేజ ఫుల్ సీరియస్ కనిపిస్తున్నాడు.
Recent Comment