సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(mahesh babu) ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ (sarkaru vaari paata) మూవీతో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత బాహుబ‌లితో వ‌ర‌ల్డ్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ( Rajamouli) దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను దర్శకుడు రాజమౌళి వెల్లడించారు.

తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. “మహేశ్ బాబుతో సినిమాకు గాను కథను పక్కాగా సిద్ధం చేసుకుంటున్నాము. ప్రీ ప్రొడక్షన్ పనులకు దాదాపుగా ఏడు నెలల సమయం పడుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఆఖర్లో ప్రారంభించాలి అనుకుంటున్నాం” అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. కాగా, దాదాపు 800 కోట్ల రూపాయలతో రూపొందించనున్న ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, మహేశ్‌ బాబుతో చేయాల్సిన ఈ సినిమాను రాజమౌళి పూర్తిగా ఆఫ్రికన్ జంగిల్ నేపథ్యంలో రూపొందించన్నట్లు సమాచారం.