కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

అయితే తాజాగా KGF chapter 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విష‌యంలోనూ అరుదైన రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రికార్డుల‌ను KGF 2 బద్దలులుకొట్టినట్లు తెలుస్తోంది. KGF 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌ విషయానికొస్తే ఈ సినిమా కర్ణాటకలో రూ.180 కోట్ల మేర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జ‌రుపుకుంద‌ట‌.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు, త‌మిళ‌నాడులో రూ.40 కోట్లు అలాగే బాలీవుడ్‌లోనూ రూ.100 కోట్లు, ఓవ‌ర్ సీస్‌లో దాదాపు రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ రూ.470 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. తాజాగా ఆ రికార్డుని కేజీఎఫ్-2 బ్రేక్ చేసింది.