దర్శకదిగ్గజం ఎస్‌ఎస్‌ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన  చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే తొలి వారం రోజుల్లోనే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా 10 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసి లాభాల వైపు పరుగులు తీస్తోంది.

తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ దేశం గర్వించదగ్గ సినిమా అని, రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి భారత సినీ సత్తాను ప్రపంచానికి తెలిసేలా చేసిందని అన్నారు. అలాగే, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని ఆయన అన్నారు.

RRR మరొక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అదేంటంటే Highest rated film on bookmyshow with 90% like and 555k+ votes తో రికార్డు సృష్టించింది