పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’(Radhe Shyam). జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో అలరించింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా… ఇప్పటివరకు ఈ చిత్రం 212.76 కోట్ల కలెక్షన్లను సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాధేశ్యామ్ సినిమా అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. నిజానికి రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు ముందు చిత్రనిర్మాణ సంస్థ నెల రోజుల తర్వాత ఓటీటీలోరిలీజ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది . కానీ రాధేశ్యామ్ మూవీ బాక్సఫీసు వద్ద తేలిపోవడంతో ఈ సినిమాను పది రోజుల ముందుగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు.
Recent Comment