గతేడాది ‘వకీల్ సాబ్’ సినిమాతో సినిమాల్లోకి పునరాగమనం చేసిన పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇటీవల ‘భీమ్లా నాయక్’ మూవీతో బ్లాక్ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ పూర్తి చేయ‌డంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాను కూడా పూర్తి చేయాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) చూస్తున్నాడు. ఇప్పప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు చిత్ర యూనిట్ తాజాగా అదిరిపోయే శుభవార్తని అందించింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ ని అందివనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాగా, ‘భవదీయుడు భగత్ సింగ్‌’(Bavadiyudu Bhagatsingh) సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన బుట్ట బొమ్మబ్ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నుంది