మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా దిగ్గజ దర్శకుసు శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ కోసం రామ్ చరణ్ అమృత్‌సర్‌కి ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ అమృత్‌సర్‌లో ఏప్రిల్‌ తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌ కోసం అమృత్‌సర్‌లోని లొకేషన్స్‌ను చిత్రబృందం పరిశీలించి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ ఫైట్‌ కూడా చిత్రీకరించనున్నారని సమాచారం. కాగా, సునీల్, నవీన్‌ చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. RC15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీని ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.