యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌(Varun Tej) కథానాయకుడుగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సఫీసు వద్ద మిశ్రమ స్పందన లభించింది. ఈ క్రమంలో గని సినిమా తొలి రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే.. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం తొలి రోజున గ‌ని సినిమాకు మూడు కోట్ల రూపాయ‌ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.

అంతకుముందు ‘గని’ సినిమా శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకొని మొత్తంగా రూ. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ క్రమంలోనే తొలిరోజునే ఇంత తక్కువ వసూళ్లు సాధిస్తే సినిమా మొత్తం రన్ పూర్తయ్యే వరకు ఎంత మేరకు వసూళ్లు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర‌, జ‌గ‌ప‌తి బాబు, న‌దియా కీల‌క‌పాత్ర‌లు పోషించారు.