యువ కథానాయకుడు వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేకర్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుండగా..మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏప్రిల్ 2న విశాఖపట్నంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రాబోతున్నాడు.
ఇదిలా ఉంటే, గని సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కు భారీ మొత్తం దక్కినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సుమారు రూ.25 కోట్లకు ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. కాగా, ఉపేంద్ర(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), నవీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapati Babu) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. అందులోని వరుణ్ తేజ్ మాస్ లుక్ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది.
Recent Comment