మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu )మీద అలాగే ఈనాడు పత్రిక మీద ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu ) మండిపడ్డారు.ఏపీ సీఎం పై చంద్రబాబు మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేలా వారు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.పోలవరం(Polavaram ) పునరావాసం రెండు ముక్కలు, రాజధాని మూడు ముక్కలు అంటూ లేనివి ఉన్నట్టు రాసి ప్రజలకు నమ్మించి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మీడియాతో సమావేశం అయిన మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu )మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో లేనిపోని కథనాలు సృష్టిస్తున్నారని,పోలవరం పురోగతి 1.46 శాతం మాత్రమేనని, 800 కోట్లు అదనంగావృధా ఖర్చు చేస్తున్నారని గవర్నమెంట్ మీద అసత్యాలు చెప్పడం కరెక్ట్ కాదని తెలిపారు.

గత ప్రభుత్వo లో చేసిన చంద్రబాబు(Chandrababu) అవినీతి వల్లే కాఫర్‌ డ్యామ్ దెబ్బ తిందని, స్పిల్‌ వే పూర్తి కాకుండానే కాఫర్‌ డ్యాం, డయా ఫ్రం వాల్‌ కట్టిన చంద్రబాబు పోలవరం ఆలస్యానికి ప్రధాన కారణం అని రాంబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు చేసిన తప్పులు వల్లే జగన్ ప్రభుత్వం మళ్ళీ 800 కోట్లు రూపాయలు ఖర్చు చేసిందని, ఇకనైనా జగన్(Jagan ) మీద ysrcp మీద దొంగ ప్రచారాలు చేయడం , తప్పుడు వార్తలు రాయడం మానుకోవాలని మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.