విక్టరీ వెంకటేష్( Venkatesh ), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) కథానాయకులుగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi ) దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ (F3) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్ 3 సినిమాను రూపొందిస్తున్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనేక వాయిదాల తర్వాత మే 27న ఎఫ్‌ 3ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఎఫ్ 3 సినిమా నుంచి ఏప్రిల్ 22న రెండో పాట ‘ఓ.. ఆ.. ఆహా ఆహా’ను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా, మెహ్రిన్, సోనాల్‌ చౌహన్‌ తాడు లాగుతూ కనిపించారు. కాగా, ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.