కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2”. (KGF2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.

అయితే తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్​ను ఈరోజు (ఆదివారం) సాయంత్రం 6.40 గంటలకు మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్ (Ram Charan) చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, రవీనా టండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. రవి బస్రూర్‌ సంగీతం అందించారు.