Vijay, Rashmika Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) మంచి జోరుమీదున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన చిత్రం ‘బీస్ట్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల అవడానికి ముందే విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు.
తాజాగా ఈ సినిమా లాంచ్ చెన్నైలో అంగరంగవైభవంగా జరిగింది. విజయ్ కెరీర్ లో 66వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ మ్యూజిక్ తమన్ సంగీత స్వరాలూ సమకూరుస్తున్నాడు. ఈ రోజు ఈసినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు జరగ్గా… ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు(Dill Raju) క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna )నటిస్తుండగా.. ఈ రోజు నుంచే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు.
Recent Comment