దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(Rajamouli), యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్(Ntr), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) ల కాంబినేష‌న్లో తెరకెక్కిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. అల్లూరి సీతా రామరాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

అయితే ఈ సినిమా విడుదలైన రోజు నుంచి ఓ అంశంపై మాత్రం విపరీతమైన చర్చ జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కంటే రామ్‌చరణ్‌ పాత్రను బాగా హైలైట్ చేశారని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ విజయోత్సవ సభలో ఇదే విషయంపై ఓ విలేకరి చిత్రబృందాన్ని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు రామ్‌చరణ్‌ స్పందిస్తూ..నేను ఎప్పుడూ కూడా అలా అనుకోలేదు ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. మేం ఇద్దరం కూడా బాగానీ నటించాం. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు అతనిపై మా స్నేహం ఎప్పటికీ ఇలానే ఉంటుంది అంటూ రామ్‌చరణ్‌ చెప్పుకొచ్చాడు.