యంగ్ హీరో నితిన్‌(Nithin) కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’(Macherla Niyojakavargam) ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నితిన్ సరసన కృతీశెట్టి, కేథరిన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్యా మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ట్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రాజ‌కీయ నేప‌థ్యంతో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం దాంతో పాటుగా సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించింది. మాచర్ల నియోజకవర్గం సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, ఈ సినిమాలో మాచర్ల నియోజకవర్గంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ రెడ్డి పాత్రలో అలరించనున్నాడు నితిన్. ఈ పాత్రలో నితిన్‌ ఆకట్టుకునేలా ఉన్నాడు. ఈ సినిమాకు సంగీతం మహతి స్వరసాగర్ అందిస్తున్నారు.