పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు'(Hari hara Viramallu). ఈ సినిమాకి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్​ బ్యానర్​పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్​గా నిధి అగర్వాల్​ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్​ ముద్దుగుమ్మ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​​ కనువిందు చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే సగ భాగం షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం, కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది. ఈ క్రమంలో చాలా రోజుల విరామం తరువాత తిరిగి షూటింగును ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని యాక్షన్ స్టిల్స్ ఫోటోలను పంచుకున్న చిత్ర బృందం తాజాగా యాక్షన్ మూమెంట్స్ వీడియోను విడుదల చేసింది. ‘ది వారియర్స్ వే’ పేరుతో వచ్చిన ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ట్రైనింగ్ యాక్షన్ మోడ్ విజువల్స్ కనిపించాయి. ఆఖర్లో పవన్ కళ్యాణ్ శత్రువుని కాలితో తన్నే సీన్ మాత్రం వారెవ్వా అనిపించేలా ఉంది.