దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌(RAM CHARAN) కథనాయకులుగా నటిస్తున్న చిత్రం ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌)(RRR). మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అజయ్ దేవ్‌గన్, సముద్రఖని, శ్రీయ ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా విడుదలకు​ ముందే​ అనేక రికార్డ్​లను బ్రేక్ చేస్తోంది. తాజాగా అమెరికా ప్రీమియర్​ ప్రీ సేల్స్​లో ఈ సినిమా ఇప్పటికే 2.5 మిలియన్​ డాలర్ల మార్కును దాటేసింది. ఈ క్రమంలోనే ‘బాహుబలి-2’ రికార్డ్ బద్దలయ్యింది. అమెరికా ప్రీమియర్స్​లో 2.4 మిలియన్​ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. అంతకుముందు ‘ ‘బాహుబలి-2’ సినిమా 2.5 మిలియన్ డాలర్లు సాధించగా.. తాజాగా ‘ఆర్​ఆర్​ఆర్’​ ఆ రికార్డును క్రాస్ చేసి 3మిలియన్​ డాలర్ల వైపు పరుగులు తీస్తుంది.