యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల కిందటే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వెలువడింది. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత స్వరాలు సమకూర్చనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt) నటిస్తుంది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఇదిలావుంటే, ఈ సినిమా ప్రారంభానికి ముందే కొరటాల శివకు ఎన్టీఆర్ కొన్ని నిబంధనలు పెట్టారని తెలుస్తోంది. గత చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ కోసం దాదాపుగా నాలుగు ఏళ్ళు ఎన్టీఆర్ డేట్స్ కేటాయించారు. ఈ క్రమంలోనే తదుపరి సినిమాల విషయంలో ఇలా సమయాన్ని వృథా చేయకూడదని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. అందుకే కేవలం 70 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాల్సిందే అని కొరటాలకు ఎన్టీఆర్ తేల్చిచెప్పినట్లు సమాచారం. కొరటాల శివ సాధారణంగానే తన చిత్రాలను చాలా తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయాలని చూస్తుంటాడు. ఈ క్రమంకోనే కొరటాల శివ కూడా ఎన్టీఆర్ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి కొత్త చిత్రాన్ని కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Recent Comment