మాస్‌ మహారాజా రవితేజ(Ravi Teja) కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. (Tiger Nageswara Rao) ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు చిత్రబృందం. ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు రవితేజ. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసం 7 కోట్లు ఖర్చు చేసి మరీ ఒక అద్భుతమైన సెట్ ని నిర్మిస్తున్నారట. ఈ సెట్ లో 1970 నాటి ఓ గ్రామాన్ని అచ్చంగా దింపేస్తున్నట్లు అని తెలుస్తోంది. కాగా, స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ కెరీర్‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందబోతుంది. కాగా, ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద తెరకెక్కబోతున్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి జీవీప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.