సీనియర్ దర్శకుడు మోహన్‌రాజా(Mohan Raja) దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) గాడ్‌ఫాదర్‌(God Father) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) కీలక పాత్రలో నటించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్​ ఇప్పటికే 70 శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో కీలక షెడ్యూల్ జ‌రుగుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర‌యూనిట్ అప్పుడే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది.

‘గాడ్​ ఫాద‌ర్’ చిత్రాన్ని ఈ ఏడాది ఆగ‌స్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ సమయంలో వరుసగా సెలవులు ఉన్నాయి ఈ కారణంగానే చిత్రబృందం రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవే తేదీల్లో స‌మంత నటించిన య‌శోద‌ మూవీ, అలాగే అఖిల్ నటించిన ఏజెంట్‌ మూవీ, అమీర్‌ఖాన్ నటించిన లాల్ సింగ్ చ‌ద్దా మూవీ విడుదల కానున్నాయి. కాగా, తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.