తమిళ స్టార్‌ హీరో విజయ్‌(Vijay), టాలెంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మూవీ ‘బీస్ట్‌'(Beast) . ఇందులో దర్శకుడు సెల్వరాఘవన్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 13న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షైన్‌ టామ్‌ చాకో, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక మరోవైపు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్-2′( KGF2) సినిమా కూడా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.

కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, రవీనా టండన్‌, రావు రమేశ్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా.. రవి బస్రూర్‌ సంగీత స్వరాలు అందించారు. అయితే ఇప్పుడు ‘బీస్ట్’ ,‘కేజీఎఫ్-2′ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడబోతున్నాయి. వీరిలో విజయ్ ప్రస్తుతం వరుస హితలతో మంచి జోరుమీదున్నాడు. ఈ క్రమంలో విజయ్ , యశ్ ఇద్దరిలో బాక్సాఫీస్ రారాజుగా నిలిచేదెవరో చూడాలి మరి.