సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్‌, 14 రీల్స్ ప్లస్సంస్థల నిర్మాణంలో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా బ్యాంక్ మోసాల నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. మే 13న విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమా షూటింగ్ ని చిత్రయూనిట్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు.

అయితే ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు రిలీజ్ అవగా అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి మాస్ ట్రీట్ సాంగ్ కోసం ఎదురు చూస్తుండగా మ్యూజిక్‌ డైరెక్టర్ థమన్ తాజాగా చేసిన ఓ ట్వీట్ తో అతి త్వరలోనే ఈ మూడో పాట రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమాకి తన డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నారట. అలాగే దీన్ని మరో మూడు రోజుల్లో పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం.