కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మించగా.. కేజీఎఫ్‌ 2 ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇందులో యశ్ న‌ట‌న‌, ప్రశాంత్ నీల్ టేకింగ్ కు ప్రేక్ష‌కులు మ‌రో సారి జేజేలు కొడుతున్నారు.

ఇదిలా ఉంటే కేజీఎఫ్ సిరీస్‌కి చాప్ట‌ర్-2 ముగింపు కాదని తెలుస్తోంది. ఎందుకంటే చాప్ట‌ర్‌-2 క్లైమాక్స్‌లో కేజీఎఫ్ మూడో భాగం కూడా ఉండ‌బోతున్న‌ట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ‘కేజీఎఫ్2’ సినిమా ఎండ్ టైటిల్స్ పడే సమయంలో రవీనా టాండన్ ఆశ్చర్యంగా ఒక బుక్ ను చేతిలోకి తీసుకొని చూస్తుంటుంది. అయితే దానిపై ‘కేజీఎఫ్3’ అని రాసి ఉంటుంది. ఈ సీన్ కు థియేటర్లలో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. అయితే తాజా సమాచారం కేజీఎఫ్3 మూవీలో హీరో యశ్ ను అంతర్జాతీయ స్థాయిలో పవర్ ఫుల్ రోల్ లో చూపెట్ట‌బోతున్నట్లు సమాచారం. కేజీఎఫ్ చాప్టర్ 3లో రాఖీభాయ్ సామ్రాజ్యం అంతర్జాతీయ స్థాయిలో విస్త‌రించ‌బోతున్న‌ట్లు సమాచారం.