మహేశ్‌బాబు(Mahesh Babu), కీర్తి సురేశ్‌(Keerthi Suresh) జంటగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట(Sarkaru Vari Pata). యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ కళావతి సాంగ్‌(Kalaa athi Song)ను ఇటీవల సెకండ్‌ సింగిల్‌ పెన్నీ ఫుల్‌ సాంగ్‌ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పాటలో మహేశ్ బాబు కూతురు సితార సితార, మ్యూజిక్ సెన్సేషన్ తమన్, మహేష్ బాబు ఇలా అందరూ తమ స్టైల్లో స్టెప్పులు వేసి అదరగొట్టారు. పెన్నీ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. నకష్ అజిజ్ పాడారు. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అయితే తాజాగా ఈ పాట మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ వీడియోలో సితారతో కొరియోగ్రాఫర్స్ డ్యాన్స్ చేయిస్తుండగ.. సెట్స్‌లో మహేష్ బాబు భార్య నమ్రత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ మేకింగ్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో అభిమానులతో పంచుకున్న నమ్రత.. ‘థాంక్యూ ఫర్ ఆల్ ది మెమోరీస్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.