నందమూరి కల్యాణ్‌ రామ్‌( Nandamuri Kalyan Ram) కథానాయకుడుగా రూపొందుతున్న 18వ చిత‍్రం ‘బింబిసార'(Bimbisara ). నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె. హరికృష‍్ణనిర‍్మిస్తున్న ఈ సినిమాకు ‘ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. వశిష్ట్‌ దర‍్శకుడిగా పరిచియమవుతున్నఈ మూవీ విడుదల తేదీని తాజాగా ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్‌. ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కాగా, ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు.

తన కెరీర్‌లో తొలిసారి ఇలా ఓ సోషియో ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు కళ్యాణ్ రామ్. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తనపై దండెత్తడానికి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన పోరాట యోధుడిగా కళ్యాణ్ రామ్‌ ఇందులో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జోడీగా ఇద్దరు హీరోయిన్స్ కేథరిన్‌, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు.