చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ 33 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు.
లివింగ్ స్టోన్ టాప్ స్కోరర్, కేవలం 32 బంతుల్లో 60 పరుగులు (5 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో) చేశాడు. జితేష్ శర్మ 26 పరుగులు చేయగా, రబడా 12 పరుగులు, రాహుల్ చాహర్ 12 పరుగులు చేశారు
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ల లో జోర్దాన్, ప్రిటోరియస్ తలా రెండు వికెట్లు తీశారు. చౌదరి, బ్రేవో, జడేజా తలా ఒక వికెట్ తీశారు.
181 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఊతప్ప 13 పరుగులు, ఋతురాజ్ 1 పరుగు చేసి అవుట్ అయ్యారు.
Recent Comment