పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) ప్రస్తుతం కెజిఎఫ్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్‌’ (Salaar) సినిమాలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ ఆద్య పాత్ర పోషిస్తోంది. పాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి రవి బస్‌రూర్‌ సంగీతం అందిస్తుండగా… సీనియర్ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

ఇదిలాఉంటే, కేజీఎఫ్ 2 చిత్రం ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లవగా… ఈ సినిమాతో పాటు స‌లార్ టీజ‌ర్ కూడా రిలీజ్ చేస్తార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. అయితే..తాజాగా కేజీఎఫ్ 2 ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప్ర‌శాంత్ నీల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స‌లార్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్ర‌భాస్ ను ఇందులో స‌రికొత్త‌గా చూస్తార‌ని.. ఆయ‌న పాత్ర చాలా డిఫ‌రెంట్ గా.. చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని అన్నారు. ఇక స‌లార్ టీజ‌ర్ గురించి చెబుతూ.. మే నెల‌లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం. ఎప్పుడు అనేది ముహుర్తం ఫిక్స్ చేసిన త‌ర్వాత అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తామ‌న్నారు. కాగా, సలార్ మూవీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.