కన్నడ అగ్ర కథానాయకుడు యశ్‌(Yash) హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2). కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించగా.. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలాగే బాలీవుడ్‌ సీనియర్ హీరో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కేజీఎఫ్​-2’ సినిమా బాక్సాఫీస్​ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

ఇక తొలి రెండు రోజుల్లోనే దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.557 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించ‌టం విశేషం. ఇక ఈ సినిమా నాలుగో రోజున ఎంత మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను రాబట్టిందో పరిశీలిస్తే.. హిందీ,రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ. 223 కోట్లు వసూలు చేయగా, ఓవ‌ర్‌సీస్ లో రూ. 97.40 కోట్లు, క‌ర్ణాట‌కలో రూ. 91.10 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 84.80 కోట్ల గ్రాస్, త‌మిళ‌నాడులో రూ.32.10 కోట్లు, కేర‌ళలో రూ. 29.05 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా KGF 2 సినిమా విడుదలైన 4 రోజుల్లో రూ.557.45 కోట్లు సాధించింది.

కాగా, దేశవ్యాప్తంగా వీకెండ్​లో భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా ‘కేజీఎఫ్​ 2’ రికార్డు సాధించింది. అలాగే కామ్​స్కోర్​ నివేదిక ప్రకారం గ్లోబల్​ బాక్సాఫీస్​లో ఏప్రిల్​ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ‘KGF 2 రెండో స్థానంలో నిలిచింది.