కోలీవుడ్ అగ్రకథానాయకుడు దళపతి విజయ్(Vijay) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆయన నటించిన ‘బీస్ట్’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఇదిలావుంటే, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చెన్నైలో చెన్నైలో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా( Rashmika Mandanna )నటిస్తోంది.
విజయ్ కెరీర్ లో 66వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ నేరుగా చేస్తున్న తొలి తెలుగు సినిమా అని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పష్టత ఇచ్చాడు విజయ్. వంశీ పైడిపల్లితో చేస్తున్న ఈ చిత్రం తెలుగులో కాదని. కేవలం తమిళ మూవీ మాత్రమే అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తామని విజయ్ చెప్పుకొచ్చారు. కాగా, టాలీవుడ్ మ్యూజిక్ తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు.
Recent Comment