దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోలుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అయితే నైజాంలో 100 కోట్ల మైలురాయిని చేరుకున్న తొలి సినిమాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డును సాధించింది. దీంతో సంతోషంలో ఉన్న దిల్ రాజు ఆర్ఆర్ఆర్ మూవీ చిత్రబృందానికి గతరాత్రి గ్రాండ్ పార్టీని ఇచ్చాడు. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ తో పాటు కొరటాల శివ, అనిల్ రావిపుడి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణితోపాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే ఈ పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడి, రాజమౌళితో నాటు, నాటు పాటకు స్టెప్పులు వేయించారు. అంతకుముందు ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఈ మూవీ సక్సెస్ మీట్లో నాటు.. నాటు.. పాటకు డాన్స్ వేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతానని రాజమౌళి అన్నారు. అందుకే ఈ పార్టీలో రాజమౌళితో నాటు.. నాటు పాటకు డాన్స్ వేయించారు అనిల్ రావిపూడి.
Recent Comment