యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr), టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) కాంబినేషన్‌తో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల కిందటే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న సైతం వెలువ‌డింది. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రూపొందుతున్న ఈ మూవీకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత స్వరాలు సమకూర్చనున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్(Alia Bhatt) న‌టిస్తుంది. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇదిలావుంటే, ఇటీవల జ‌రిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ త‌న కొరటాల సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుందని వెల్లడించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర డిఫరెంట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయ‌న పూర్తి స్థాయిలో త‌న లుక్‌ ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ దాదాపు ప‌ది కిలోల బ‌రువు కూడా త‌గ్గ‌బోతున్నట్లు సమాచారం. ఏదేమైనా సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ మీల్స్ అందించడం ఖాయంగా కనిపిస్తోంది.