బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు నేషనల్ ​స్టార్‌ ప్రభాస్‌(Prbhas). ప్రస్తుతం ఆయన చేస్తున్నవన్నీ భారీ సినిమాలే కావడం విశేషం. ఈ స్టార్‌ హీరో ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’లో నటిస్తున్నాడు. కాగా ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ (Adipurush)
సినిమాని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించారు. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరపడుతున్నారు. రామాయ‌ణ గాథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని టీ సిరీస్‌ నిర్మిస్తోంది.

ఇదిలాఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే శ్రీరామ నవమి రోజున ప్రభాస్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వాలని భావిస్తోందట చిత్రబృందం. శ్రీరామ నవమి కానుకగా ఏప్రిల్ 10వ తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కాగా, ఇందులో కృతి సనన్(Kriti Sanon) ‘సీత’ పాత్రలో నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) ‘రావణుడి’ పాత్రలో కనిపించనున్నాడు.