మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్(Ram Charan), యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌(Ntr) కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లోనే కలెక్షన్ వర్షం కురిపించిన ఈ సినిమా మూడో రోజు ఆదివారం కావడంతో బాక్సఫీసు దుమ్ముదులిపింది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ మూడో రోజు క‌లెక్ష‌న్స్‌ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

★(తెలంగాణ+ఆంధ్రప్రదేశ్) రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ తొలి మూడు రోజుల వసూళ్లు..

★తొలి రోజు: 74.11 కోట్లు
★రెండో రోజు: 31.63 కోట్లు
★మూడో రోజు: 33.53 కోట్లు

మొత్తంగా చూస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తొలి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 139.27 కోట్ల నెట్, 203.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలాగే ఈ సినిమా తొలి మూడు రోజుల్లో కర్ణాటకలో 18.50 కోట్లు, తమిళనాడులో 16.20 కోట్లు, కేరళలో 5 కోట్లు, హిందీలో 36.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్లు, ఓవర్‌సీస్‌లో 56.10 కోట్ల కలెక్షన్లు వాసులు చేసింది.

★ మొత్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తొలి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 275.72 కోట్ల నెట్, 470 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.