ఆంద్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డిపై (Ys Jagan ) మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli aruna kumar )తీవ్ర విమర్శలు చేసారు. జగన్ ఒక వ్యాపారవేత్త అని , రాష్ట్రంలో పాలన కాకుండా పెద్ద గ్యాంబ్లింగ్ చేస్తున్నారని నిందించారు.
ప్రజలని మోసం చేసే పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు డబ్బులు వేసాను కాబట్టి వాళ్లు నాకు ఓటు వేయాలి అన్నట్టుగా సీఎం జగన్ పద్ధతి ఉందని తెలిపారు. అసలు క్విడ్‌ ప్రోకోకి ఇదే నిదర్శనం అని తెలిపారు. ఓట్లు పడతాయి అనుకున్న వాళ్ళకే పథకాలు ఇస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు.కానీ పథకాల పేరుతో డబ్బులు ఇచ్చి పన్నుల రూపంలో మరింత ఎక్కువ వసూల్ చేస్తున్నారని తెలిపారు.

పక్క రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని కానీ ఆంద్రప్రదేశ్ లో (Ap )మాత్రం ఎన్నడూ లేని విధంగా కరెంట్ తీస్తున్నారని విమర్శించారు. కరెంట్ మిగులు ఉన్నపటికీ రాష్ట్రాన్ని జగన్ (Ys Jagan ) ఇలా తయారు చేసారని ఉండవల్లి ఆరోపించారు. ఇక వీరి విమర్శల పై Ysrcp నాయకుల ఎలా స్పందిస్తారో చూడాలి.