నాచురల్‌ స్టార్‌ నాని(Nani) హీరోగా యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’.(Ante Sundaraniki ). మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ .వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

అయితే వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మూవీ టీజర్ విడుదల గురించి మేకర్స్ బిగ్ అనౌన్సమెంట్ ఇచ్చారు. ‘అంటే సుందరానికీ’ టీజర్‌ను ఏప్రిల్ 20న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో టీజర్‌ను విడుదల కార్యక్రమం జరపనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే ఈ కార్యక్రమానికి పలువురు సినీతారలు కూడా హాజరవుతారని చిత్రయూనిట్ పేర్కొన్నారు. కాగా, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందనున్న ఈ మూవీలో నజ్రియా లీలా థామస్‌ పాత్రలో నటించనుంది. అలాగే ఇందులో నాని కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు.