ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లో, టాస్ గెలిచి రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. 

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.  ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ చెరో 26 పరుగులు చేసి అవుట్ అయ్యారు.  ఆ తరవాత వచ్చిన బ్యాట్స్ మన్ ల లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఆడాడు, అద్భుతం గా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ కేవలం 37 బంతుల్లో, ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్ల సహాయంతో 68 పరుగులు చేసి అజేయం గా నిలిచాడు.  తిలక్ వర్మ, కీరన్ పోలార్డ్ లు డక్ అవుట్ అయ్యారు.

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్ల లో హాసరంగా, హర్షల్ పటేల్ లు చెరో రెండు వికెట్లు తీశారు.  ఆకాష్ దీప్ కు ఒకటి వికెట్ దక్కింది.

అనంతరం 152 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

ఓపెనర్ డుప్లెసిస్ పరుగులకే అవుట్ అయినా, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ లు రెండో వికెట్ కు 80 పరుగులు జోడించి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ను గెలుపు బాట పట్టించారు. అనుజ్ రావత్ 47 బంతుల్లో, 66 పరుగులు, విరాట్ కోహ్లీ 36 బంతుల్లో, 48 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అయితే అప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు గెలుపు లాంఛనమే అయ్యింది. దినేష్ కార్తీక్ 7 పరుగులతో, మాక్స్ వెల్ 8 పరుగులతో అజేయం గా నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్ల లో Unadkat, Brevis తలా ఒక వికెట్ తీశారు