గతం లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సోలో గా ఈ 2022 సంక్రాంతి కి వచ్చి విజయం సాధించాడు. నాగార్జున, నాగ చైతన్య లు కలసి నటించిన చిత్రం. రమ్యకృష్ణ, కృతి శెట్టి వీరికి జంట గా నటించారు. ఈ బంగార్రాజు పండగకి రావడం వలన హిట్ కొట్టాడు. కరోనా పరిస్థితులలో, సినిమాలు విడుదల చేయాలా వద్దా అన్న సందిగ్ధం లో ఉన్నప్పుడు, నాగార్జున ధైర్యం చేసి సోలో గా ఈ బంగార్రాజును విడుదల చేశాడు.
సంక్రాంతి కి విడుదలైన చిత్రాలు యావరేజ్ గా ఉన్నా, ఆంధ్ర ప్రదేశ్ లో కలెక్షన్స్ కురిపిస్తాయి ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి ఫెస్టివల్ గొప్పతనం అలాంటిది. ఈ బంగార్రాజు లో పాటలు పరవాలేదనిపించాయి, విజువల్స్ పరం గా బానే ఉంటుంది. అయితే కద, కధనాలు ఏమంత పండలేదు. వినోదం పాళ్ళు కూడా తక్కువే
అయితే బంగార్రాజు 18th ఫిబ్రవరి నుండి జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 లో స్ట్రీమింగ్ మొదలైన నెల తర్వాత, ఇటీవల ఈ బంగార్రాజు ని జీ తెలుగు వారు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మార్చ్ 27న ప్రసారం చేశారు.
బంగార్రాజు మూవీ 14 TRP పాయింట్ లు సాధించింది. సీనియర్ హీరో సినిమాల లో, ఈ రేటింగ్ చెప్పుకోదగ్గ రేటింగ్ అనుకోవచ్చు.
Recent Comment