కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ “కేజీఎఫ్‌-2″(KGF Chapter 2) నాలుగేళ్ల కిందట బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కేజీఎఫ్‌ 2 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఊహించని అప్ డేట్ అందించారు చిత్రబృందం. బాక్సఫీసు వద్ద క‌లెక్ష‌న్ల ప్రభంజనం సృష్టించిన కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 1 (KGF chapter 1)ను మళ్ళీ విడుదల చేయాల‌ని నిర్ణ‌యించారు మేకర్స్. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ధ‌ర‌ల‌కే కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీని చూసే అవ‌కాశం కల్పించారు. ఏప్రిల్ 8న కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 1
మళ్ళీ విడుదల కానుంది. కాగా, “కేజీఎఫ్‌-2” మూవీలో సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్‌ రాజ్‌, రవీనా టండన్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. రవి బస్రూర్‌ సంగీతం అందించారు.