కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘బీస్ట్’ ( Beast Movie ). నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde ) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, సెల్వరాఘవన్, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించగా అనిరుధ్ రవిచంద్రన్ సంగీత స్వరాలూ సమకూర్చారు. అయితే భారీ తారాగణం, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13న విడుదలైంది. అంచనాలను మించేలా ‘బీస్ట్’ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఈ సినిమా తెలుగురాష్ట్రాల్లో దాదాపుగా 505కి పైగా థియేటర్లలో విడుదలవగా, మొదటి రోజే నైజాంలో రూ. 3.05 కోట్లు వసూలు చేసింది. అలాగే సీడెడ్ లో రూ. 2.1 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.40 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బీస్ట్’ సినిమా తొలి రోజు రూ.5 నుంచి 7 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజే రూ. 35 కోట్లు వసూలు చేయగా, దేశవ్యాప్తంగా తొలి రోజు రూ. 50 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 65 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
Recent Comment