శ్రీ శుభకృత్ నామ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు ముందుగానే వచ్చింది.  పేరుకు తగ్గట్టు అన్ని శుభాలే ఈ సంవత్సరం.  తెలుగు సినీ పరిశ్రమకు నాలుగు నెలల ముందే శ్రీ శుభకృత్ నామ సంవత్సరం వచ్చిందని చెప్పాలి.

అఖండ సినిమా రిలీజ్ తో డిసెంబర్ లో మొదలైన ఈ శుభ ఘడియలు, పుష్ప సినిమా తో మరిన్ని సంతోషాలని తెచ్చింది.  పుష్ప సినిమా హిందీ లో వసూళ్ల వర్ష కురిపించింది.

అయితే మధ్యలో రాధే శ్యామ్ రూపం లో కొంత చేదు ను, వగరును రుచి చూపించి నా, ఆ తరవాత వచ్చిన RRR నిజమైన శ్రీ శుభకృత్ నామ సంవత్సరాన్ని ఒక వారం ముందే తెచ్చింది.

ఇండియా లో RRR హైయెస్ట్ సెకండ్ గ్రాస్ కలెక్షన్స్ రికార్డు క్రియేట్ చేసింది. 

ఎవరిని కదిపినా మాట్లాడుకునేది RRR గురించే, , ఏ వెబ్ సైట్  చూసిన RRR వార్తలే,  సోషల్ మీడియా లోనూ RRR గురించి చర్చలే. 

ముందు కూడా ఆచార్య, F3, సర్కారువారి పాట చిత్రాలు మరిన్ని శుభాలను తీసుకొస్తాయి అనడం లో సందేహం లేదు.

కాబట్టి పేరుకు తగ్గట్టు గానే, ఈ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం అందరికి శుభాలను తీసుకొస్తుందని ఆశిద్దాం.