తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం

IPL కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ అరంగేట్ర మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన  లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.

కెప్టెన్ కే ఎల్ రాహుల్ డక్ అవుట్ కాగా, దీపక్ హుడా, ఆయుష్ బాధొని అర్ధ సెంచరీ ల తో రాణించారు.  దీపక్ హుడా 55 పరుగులు, ఆయుష్ బాధొని 54 పరుగులు చేశారు.  చివర్లో కృనాల్ పాండ్య బ్యాట్ ఝుళిపించి 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్ల లో షమి 3 వికెట్లు తీయగా, వరుణ్ ఆరోన్ 2 వికెట్లు తీశాడు.  స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఓపెనర్ శుభమన్ గిల్ డక్ ఔట్ అయ్యాడు.

అయితే డేవిడ్ మిల్లర్ 21 బంతుల్లో 30 పరుగులు, రాహుల్ తేవాతిఆ 24 బంతుల్లో 40 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్ ని గెలిపించారు. హార్దిక్ పాండ్యా, మాథ్యూ వే డ్  చెరో ౩౦ పరుగులు చేసి రాణించారు.  ఆఖర్లో అభినవ్ మనోహర్ కూడా బ్యాట్ ఝుళిపించి 7 బంతుల్లో 14 పరుగులు చేశాడు

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ : షమీ