యువ కథానాయకుడువరుణ్‌ తేజ్‌(Varun Tej) హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా బాలీవుడ్‌ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ‘గని’ యాక్షన్ ట్రైలర్ ను ఈరోజు రాత్రి 8 గంటలకు విడుదల చేస్తున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. ఉపేంద్ర‌(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), న‌వీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapati Babu) త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. . కాగా, ఈ సినిమాలో వ‌రుణ్‌ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. అందులోని వరుణ్‌ తేజ్ మాస్‌ లుక్‌ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది.