యువ కథానాయకుడు వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గని’(Ghani). ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ నటి సయీ(Sayi Manjrekar) మంజ్రేకర్ నటిస్తోంది. ఉపేంద్ర(Upendra), సునీల్ శెట్టి(Sunil Shetty), నవీన చంద్ర(Naveen Chandra), జగపతి బాబు(Jagapati Babu) తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు గని నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు చిత్రబృందం. తాజాగా ఈ మూవీ నుంచి ‘కొడితే’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా అదిరిపోయే స్టెప్పులతో ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. అందులోని వరుణ్ తేజ్ మాస్ లుక్ ఇప‍్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది.
Recent Comment