పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’(Radhe Shyam) . పూజ హెగ్డే కథానాయిక. కె. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కగా.. ఈ మూవీలో ప్రభాస్‌(Prabhas) విక్రమాదిత్య పాత్రలో, పూజ హెగ్డే(Pooja hegde) ప్రేరణగా కనిపించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. 300 కోట్లకు పైగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మార్చి 11న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది.

అయితే విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వ‌చ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా విడుదలై 9 రోజులైంది. ఈ క్రమంలో మరి ఈ 9 రోజుల్లో రాధే శ్యామ్ కలెక్షన్లు ఎల్లా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో రాధేశ్యామ్‌ 9వ రోజు కలెక్షన్ల రిపోర్ట్..

★నైజాం: 14 లక్షలు
★సీడెడ్‌: 5 లక్షలు
★ఉత్తరాంధ్ర: 4 లక్షలు
★తూర్పు గోదావరి: 3 లక్షలు
★పశ్చిమ గోదావరి: 2 లక్షలు
★గుంటూరు: 3 లక్షలు
★కృష్ణా: 2 లక్షలు
★నెల్లూరు: 1 లక్ష

రాధేశ్యామ్‌ సినిమా మొత్తంగా 9వ రోజు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 34 లక్షలు షేర్‌తో పాటు 50 లక్షలు గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 81.18 కోట్లు షేర్‌తో పాటు 146 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.