యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో కేజీయఫ్‌ 2 ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను సృష్టింస్తోంది. ఇక‌ ఇప్ప‌టికే ఈ చిత్రం కేవ‌లం ప్రీ బుకింగ్స్‌తోనే దాదాపు 60కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. కన్నడ స్టార్‌ హీరో యశ్‌(Yash) కథానాయకుడుగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ నిర్మించారు.

అయితే ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ‘ఎద‌గ‌రా ఎద‌గ‌రా’ అంటూ సాగే పాట తొలి పాటను అలాగే ‘ర‌ణ ర‌ణ ర‌ణధీరా’ అంటూ సాగె రెండో పాటను చిత్రబృందం రిలీజ్ చేయగా వాటికి చక్కటి స్పంద‌న లభించింది. ఈ క్రమంలోనే తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా నుంచి ‘మెహబూబా’ అంటూ సాగే మూడో పాట‌ను రిలీజ్ చేశారు.హీరోహీరోయిన్ల మధ్ ఉన్న ప్రేమను తెలియజేసేలా సాగిన ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు ర‌వి బ‌స్రూర్ సంగీత స్వరాలూ సమకూర్చారు. అలాగే ఈ పాట తెలుగు వెర్షన్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. అనన్య భట్ పాడారు.